23-08-2025 06:53:05 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ లోని కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమంలో అనాధ వృద్ధులు, మానసిక వికలాంగుల, కుటుంబ సభ్యుల సమక్షంలో మంచిర్యాల మున్సిపల్ నగర కమీషనర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కెక్ కట్ చేసి, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టిన అనంతరం కమిషనర్ దంపతులు అన్నదానం చేశారు.