calender_icon.png 22 September, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెన్ -జీతోనే బీఆర్‌ఎస్ పాలన అంతం

22-09-2025 01:03:07 AM

  1. కేంద్ర మంత్రి బండి సంజయ్

ఎక్స్ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఓ ఛానల్ ప్రొగ్రామ్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా కౌంటరిచ్చారు. నేపాల్ జెన్ ఉద్యమంపై స్పందిస్తూ భారత్‌లో కూడా ఇలానే ప్రభుత్వం ఉంటే...జెన్ ఉద్యమం వచ్చే అవకాశముందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అదే ఇంటర్వ్యూలో ఉన్న యువత కేటీఆర్ వ్యాఖ్యలకు భిన్నంగా భారత్‌లో జెన్‌d ఉద్యమం వచ్చే అవకాశం లేదని బదులిచ్చారు.

అయితే ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆదివారం స్పందిస్తూ ‘నేపాల్‌లో జెన్ బంధుప్రీతికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు, కానీ తెలంగాణలో మాత్రం జెన్ ఉద్యమం మొదట బీఆర్‌ఎస్ పార్టీపైనే మొదలైందని, రాష్ట్రంలోని జెన్ యువత బీఆర్‌ఎస్ పాలనను అంతం చేశారని, లోక్‌సభ ఎన్నికల్లో జీరో సీట్లకు పరిమితం చేశార’ని విమర్శించారు.