calender_icon.png 22 September, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ వీసా ఫీజు పెంపు కేంద్ర వైఫల్యమే

22-09-2025 01:02:27 AM

-భారతీయులు మానసిక క్షోభకు గురవుతున్నారు

-అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలి

-మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : అమెరికా హెచ్1బీ వీసా ఫీజు, భారత్‌పై 25 శాతం టారిఫ్ పెంచడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. కేంద్ర ప్రభుత్వ దౌత్య వైఫల్యాన్ని ఈ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికా తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల లక్షలాది కుటుంబాలు, వేలాది పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. అమెరికాలో చదువుతున్న లక్షలాది భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఇతర పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రభు త్వంతో అవసరమైన చర్చలు జరిపి, ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరారు.