calender_icon.png 22 September, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ కళాక్షేత్రంలో నాటకోత్సవాలు షురూ

22-09-2025 01:04:10 AM

-కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు

-ఆకట్టుకున్న చాకలి ఐలమ్మ జీవిత నాటక ప్రదర్శన

హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) తెలంగా ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాళో జీ కళాక్షేత్రంలో గురువారం కాకతీయ నాటకోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమ య్యా యి. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూ పల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, మేయర్ గుండు సుధారాణి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రా జయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా అనేక నాటక ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ జీవిత నాటక ప్రదర్శన అందరిన్ని అలరించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, జీడబ్ల్యూఎంసీ కమి షనర్ చాహత్ వాజ్‌పేయీ, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి  పాల్గొన్నారు.