14-05-2025 12:32:56 AM
- ఆటలతో చిన్నారుల్లో శారీరక, మానసిక వికాసం
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమ్మర్ క్యాంపులు
- సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శిక్షణ శిబిరాలు
- ఆయా డివిజన్లలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ’ఈత కొలనులు’
ఎల్బీనగర్, మే 12 : వేసవి సెలవులు అం టేనే పెద్దలు, చిన్నారులకు ఆటవిడుపు. పెద్ద లు విహారయాత్రలకు సిద్ధమవుతుంటే... పి ల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడుకుంటా రు. పరీక్షలు పూర్తి కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నతికి దోహదపడే ప్రత్యామ్నా య అంశాలపై దృష్టి సారించారు.
ఇంట్లో ఉంటే సెల్ ఫోన్లు, టీవీ, కంప్యూ టర్ స్క్రీన్లకు అతుక్కుపోతున్న పిల్లల్లో మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంపొందించడానికి ఇష్టమైన క్రీడాంశాల్లో శిక్షణ ఇప్పించడానికి ఆసక్తి చూ పుతున్నారు. వేసవిలో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రభు త్వం క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నది. ఔట్ డోర్, ఇండోర్ స్టేడియాల్లో వివిధ క్రీడాంశాలపై పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి వేసవి శిబి రాలు నిర్వహిస్తున్నది. వీటితోపాటు ప్రైవేట్ వ్యక్తులు ప్రత్యేకంగా మైదానాలు నిర్మించి, క్రికెట్, బాస్కెట్ బాల్ ఇతర క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు.
సరూర్‌నగర్ స్టేడియంలో సందడే సందడి
ఎల్బీనగర్ నియోజకవర్గంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ముఖ్యమైనది. ఇక్క డ ఏడాది పొడవునా ఔత్సాహిక క్రీడా కారులు తమకు ఇష్టమైన క్రీడలో సాధన చేస్తుంటారు. వేసవిలో పిల్లల కోసం నామమాత్రపు ఫీజుతో క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులు సరూర్ నగర్ స్టేడియంలో శిక్ష ణ పొందుతు న్నారు.
ఉదయం, సాయం త్రం వేళల్లో స్టేడి యం ఔత్సాహిక క్రీడాకారులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులతో కిట కిటలాడుతోంది. పిల్లలకు నామమాత్ర పు ఫీజు తీసుకుని అనేక వసతులు కల్పించి, ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలకు ఈత నేర్పించాలని భావించే తల్లిదండ్రు లకు సరూర్ నగర్ స్టేడియంతో పాటు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని స్విమ్మిం గ్ పూల్ ను ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజూ మూడు బ్యాచ్ చొప్పున శిక్షణ ఇస్తున్నారు. వయసు, ఆసక్తి ఆధారంగా బ్యాచులను ఎంపిక చేస్తున్నా రు. పురుషులతోపా టు మహిళ లకుప్రత్యేక సమయం కేటాయించారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్ష
చిన్నారులకు వేసవి శిబిరాల్లో భాగంగా స్కేటింగ్, వాలీబాట్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, టెన్నిస్, క్రికెట్, అథ్లెటిక్స్, కబడ్డీ, బాక్సింగ్, రన్నింగ్ ఇతర క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. చిన్నవయసు పిల్లలకు స్కేటింగ్, జిమ్నాస్టిక్స్ లో శిక్షణ ఇస్తున్నారు. ఎంచుకున్న క్రీడాంశాల్లో ఏడాదంతా సరూర్ నగర్ స్టేడియంలో శిక్ష ణ పొందొచ్చు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయిల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొని పతకాలు సాధించవచ్చు. ఇటీవల జరిగిన సీఎం కప్ పోటీల్లో అనేక మంది సత్తా చాటి, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
బలవర్ధకమైన అల్పాహారం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
సరూర్ నగర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు. ముఖ్యంగా తక్షణ శక్తి రావడాని కి రాగి జావ, ఉడికించిన గుడ్డు ఇస్తున్నారు. నిద్ర లేవగానే స్టేడియానికి వస్తున్న చిన్నపిల్లలకు ఆటలపై ఆసక్తి పెంపొందించడానికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి.
ఆటలతో సంపూర్ణ ఆరోగ్యం
పిల్లలకు ఆటలపై ఆసక్తి పెంపొందించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు నిత్యం ఆటల ఆడితే శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారు. పాఠశాల స్థాయి నుంచే ఆటలు ఆడించాలి. ఇందుకోసం ప్రభుత్వం కూడా కృషి చేయాలి. క్రీడాకారులకు అదనపు మార్కులు వేయాలి.
సరూర్ నగర్ స్టేడియంలో నిష్ణాతులైన కోచ్ లు ఉన్నారు. స్టేడియంలో 12 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణతోపాటు విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యం పెంపొందిస్తున్నాం. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాల్లో అడ్మిషన్లు స్వీకరిస్తున్నాం.. సమ్మర్ క్యాంపుల్లో భాగంగా 25 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నాం.
వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడలశాఖ అధికారి