04-09-2025 10:56:15 PM
ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు(MPDO CH Ratnakar Rao) సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన తాసిల్దార్ సుజాత రెడ్డితో కలిసి మండలంలోని గోడల పంపు, కొత్తపేట్, బావా పూర్, గోసంపల్లి, గ్రామ పంచాయతీల ఇందిరమ్మ కమిటీలు, పంచాయతీ కార్యదర్శి, మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. నిర్మాణ దశలు పరిశీలించి లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఖానాపూర్ మండలానికి మంజూరైన ఆధార్ సెంటర్ ని ప్రారంభించారు.