04-09-2025 11:00:18 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఫార్మసీ కళాశాల ద్వారానే కాకతీయ విశ్వవిద్యాలయ(Kakatiya University) ప్రతిష్ట విశ్వవ్యాప్తం అయిందని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్యకే ప్రతాపరెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసి కళాశాల గోల్డెన్ జూబ్లీ సమావేశంలో భాగంగా ప్రిన్సిపాల్ ఆచార్య కృష్ణవేణి అధ్యక్షతన విశ్వవిద్యాలయం సినేటి హాల్లో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అల్యూమిని, స్టూడెంట్స్, ఫ్యాకల్టీని ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్, అమెరికాలో నిర్వహిస్తున్నట్టు గోల్డెన్ జూబ్లీ ముగింపు యూనివర్సిటీలో నిర్వహించాలి అన్నారు. ప్రారంభ దశలో కళాశాల నిర్వహణను చేపట్టిన అధ్యాపకుల సేవలను అభినందించారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో మంచి పరిశోధన జరగాలి అన్నారు. 40శాతం రూస నిధులు ఫార్మసి కళాశాలలకు కేటాయించినట్లు తెలిపారు.
అకాడమిక్ ద్వారానే గొప్పతనం వస్తుందని, ఇండస్ట్రీ ఎక్స్ క్లోజర్ కావాలి అన్నారు. అల్యూమిని అందించిన సేవలు వృధా కావని అన్నారు. విశ్రాంతి ఆచార్యులు కళాశాల ప్రధమ ప్రిన్సిపల్ ఆచార్య పరమేశ్వర్ మాట్లాడుతూ ఎంతోమంది గొప్ప విద్యార్థులను అందించిన ఈ ఫార్మాసి కళాశాల టీచింగ్ లో నా ప్రేరణ అన్నారు. మొదటి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరామయ్య కళాశాల అభివృద్ధిలో ఆయన చోరువ మరువలేనిది అన్నారు. అనంతరం వైస్ ఛాన్సర్ ఆచార్య జాఫర్ నిజాం, ఆచార్య వాసుదేవ్, ఆచార్య జయశంకర్ లు చాలా సహకరించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆచార్య వి రామచంద్రం మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి వన్నెతెచ్చిన కళాశాల ఫార్మసీ అన్నారు గొప్ప పరిశోధన అవకాశాలు ఉన్నాయన్నారు. నేటి విద్యార్థులు వాటిని స్ఫూర్తిగా తీసుకొని అనేక రకంగా విస్తృతంగా పరిశోధన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ గారి సమ్మయ్య నరసింహారెడ్డి పరిశోధకులు పూర్వ విద్యార్థులు విశ్రాంత ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.