calender_icon.png 5 September, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎల్ఐసి సంస్థ వారోత్సవాలు

04-09-2025 10:52:53 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో బీమా వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. సంస్థలో పనిచేసిన సీనియర్ ఏజెంట్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సుభాష్(Branch Manager Subhash) మాట్లాడుతూ, ఏఎల్ఐసి సంస్థ ప్రారంభించి 69 సంవత్సరాలు పూర్తయ్యాయని, కోట్ల రూపాయల లాభాలతో సంస్థ ముందుకు వెళుతుందని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికీ బీమా కల్పించడమే ఎల్ఐసి లక్ష్యం అన్నారు, ఇప్పటివరకు చాలా మందికి  బీమా అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ సింగం నర్సయ్య,శ్రీధర్, ఏజెంట్ లు బట్టుపల్లి అశోక్,అడప సతీష్,జడి తిరుపతి,శ్రీనివాస్ రాజు,అరుణ్,శ్రీరామ్,మల్లేష్,ఆనంద్ రావు,తదితరులు పాల్గొన్నారు.