calender_icon.png 5 September, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడంగల్ తర్వాత కామారెడ్డికి అభివృద్ధిలో అధిక ప్రాధాన్యత ఇస్తా

04-09-2025 10:49:47 PM

స్థానిక ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కోసం చొరవ చూపాలి..

నిధులు ఇచ్చేందుకు నేను రెడీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): గత శాసనసభ ఎన్నికల్లో తాను కామారెడ్డి నుంచి పోటీ చేసినప్పుడు ప్రచారంలో కామారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను గతంలో కొడంగల్ అభివృద్ధితోపాటు సమానంగా కామారెడ్డినీ అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పనుల వివరాలను అధికారులతో ఎస్టిమేట్లు వేయించి తన దృష్టికి తీస్తే నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. కొడంగల్ ను ఎంత అభివృద్ధి చేశానో కామారెడ్డిని అంతా అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు ప్రజలు కాంగ్రెస్ నాయకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండేదని ఈ ప్రాంత ప్రజలు మంచి చేస్తే మర్చిపోరని తెలిపారు అన్నారు. కామారెడ్డి ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని ముఖ్యమంత్రి అన్నారు. కలిసికట్టుగా ఉండి పార్టీలకతీతంగా అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిని అని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. వరద బాధితులను రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. వారి కష్టనష్టాలను చూడండి చూసేందుకు కామారెడ్డికి వచ్చినట్లు తెలిపారు. భారీనష్టం వాటిల్లిందని, రోడ్లు, కల్వర్టులు, మేజర్, మినీ, ప్రాజెక్టులు ట్యాంకులు ధ్వంసం అయిన వాటికి సంబంధిత శాఖల అధికారులు నష్టాల వివరాలు అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ చొరవ చూపి వెంటనే నష్టం తో పాటు శాశ్వత మరమ్మతులు చేసేందుకు కావలసిన నిధులను ఎస్టిమేట్ వేసి పంపించాలన్నారు. 28 లక్షలతో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు 108 సంవత్సరాలైనా చెక్కుచెదరకుండా ఇంత భారీ వర్షాలు కురిసిన ప్రజలకు హాని కలగకుండా కాపాడిందన్నారు. ప్రాజెక్టుల వద్ద చిన్న చిన్న మరమత్తుల పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆసీస్ సంఘవన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లాలో జరిగిన వరద నష్టం పై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.