04-09-2025 10:58:50 PM
భద్రాచలంలో 18 ఏళ్లుగా మట్టి గణపతితో నవరాత్రోత్సవాలు కొనసాగింపు
భక్తితో పాటు పర్యావరణం కాపాడటమే యంగ్ బాయ్స్ ఉద్దేశ్యం
భద్రాచలం (విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం(Bhadrachalam) పుణ్యక్షేత్ర పట్టణంలో యంగ్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి గణపయ్యకు 10 కేజీల విప్పలడ్డూను సమర్పించాడు బోర పెడ్డిరెడ్డి అనే భక్తుడు. అనంతరం గణపతి మహారాజుకు దూపదీపనైవేద్యలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి రామయ్య వనవాసం చేసిన ఈ ప్రాంతంలో వైకుంఠ రాముడికి అత్యంత ప్రీతిపాత్రనైనది కూడా విప్ప ప్రసాదమే అని పర్యావరణ రహిత విగ్రంగా పేరు పొందింది. 18 అడుగుల మట్టి గణపయ్యకు వాటర్ కలర్స్ తో సుందరంగా కొలువై పూజలందుకుంటున్న గణపతి మహారాజుకు విప్పాపువ్వు డ్రైప్రూట్స్ లడ్డు అందించి మొక్కును తీర్చుకున్నానని భక్తుడు తెలిపాడు. బొజ్జ గణపయ్యకు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పి. శ్రీకాంత్ రెడ్డి, మల్లెల లోకేష్ కుమార్, సీరపు సాయి సంపత్ రెడ్డి, ఆకుల వెంకట్, బెల్లంకొండ పుష్పగిరిలు పాల్గొన్నారు.
18 అడుగుల మట్టి మహా గణపయ్య...
భద్రాచల పట్టణంలో ప్రభుత్వ ఏరియా అసువత్రి సెంటర్ నందు గణపతి నవరాత్రి ఉత్సవాలు వినూత్నంగా జరుగుతున్నాయి. ప్రతి యేటా పర్యావరణహితమైన మట్టి గణపతులను ప్రతిష్టిస్తూ గత 22 ఏళ్లుగా యంగ్ బాయ్స్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ ఉత్సవాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బొంబాయి ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 18 అడుగుల భారీ మట్టి మహా గణపయ్య విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
విప్పపూల లడ్డు
భద్రాచలం ఏజెన్సీలోని విస్తారంగా లభించే అటవీ ఉత్పత్శుల్లో విప్ప పువ్వు ఒకటి. గిరిజనులు సేకరించిన విప్పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే గాక అనేక అనారోగ్య సమస్యలను రూపుమాపే దివ్య ఔషద గున్నాలన్న 10 కేజీల విప్పపువ్వు డ్రైఫ్రూట్స్ లడ్డూను తయారు చేసి గణపతి మండపంలో సమర్పించి భక్తిని చేటుకున్న బోర పెద్దిరెడ్డి అనే భక్తుడిని పట్టణ ప్రముఖులు ప్రశంశించారు.