04-09-2025 10:47:35 PM
సీఐ వెంకట్ రెడ్డి..
సిర్గాపూర్/కంగ్టి (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి(CI Venkat Reddy) గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ... గణేశ్ నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిర్గాపూర్, కల్హేర్, కంగ్టి మండలల్లో, మండల పరిధిలల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జనం ఊరేగింపులో కరెంటు తీగలను గుర్తించాలన్నారు. అదేవిధంగా డిజే సౌండ్, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి ప్రజలకు ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. చెరువుల వద్ద లోతైన ప్రదేశంలో వెళ్లకూడదని సీఐ వెంకట్ రెడ్డి అన్నారు.