calender_icon.png 14 May, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

14-05-2025 12:34:19 AM

యాదాద్రి భువనగిరి మే 13 ( విజయక్రాంతి ) : వానకాలం 2025-26 కు వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భముగా నకిలి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ ,  అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు.  మంగళవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం లో నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో  నకిలి విత్తనాలను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.    వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు.  ఈ  స్పెషల్ స్క్వాడ్స్ బృందాలు నకిలి విత్తనాలు అమ్మే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. 

వ్యవసాయ అధికారి గోపాల్  మట్లాడుతూ... విత్తనాల లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ నుండి మాత్రమే  విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన  విత్తనాలకు తప్పనిసరిగా రసీదు పొందాలని, పంట కాలం ముగిసేవరికి రసీదును జాగ్రత్త పరచాలన్నారు. 

 విత్తన నాణ్యత లోపం వలన జరిగే పంట నష్టమును నిర్ధారించి, పంట నష్ట పరిహారం ఇప్పించడానికి  విత్తన కొనుగోలు రసీదు తప్పనిసరి  అని గుర్తుంచుకోవాలన్నారు.  కొనుగోలు చేయధలిచిన ప్రతి పత్తి విత్తన ప్యాకెట్ పై ప్యాకింగ్ తేదీని సరిచూసుకోవాలని తెలియజేసారు.  అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ మట్లాడుతూ...  ఎమ్మార్పీ రేటు కన్న ఎక్కువ ఇచ్చి  విత్తనాలు కొనగోలు చేయరాదన్నారు.

ఎవరైన ఎమ్మార్పీ  రేటు కన్నా ఎక్కువ అమ్మజూపిన వెంటనే మీ మండల వ్యవసాయ అధికారికి తెలియచేయాలన్నారు.   సమీపంలో లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ నుంచి కాకుండా ఇతరుల ధగర నుండి  విత్తనాలు కొనరాదని, ప్రధానంగా విడి  విత్తనాలు అమ్మే వారి దగ్గర, రాత్రి సమయంలో అమ్మే వారి దగ్గర, ఎమ్మార్పీ రేటు కంటే తక్కువగా అమ్మే వారి దగ్గర, అనుమానా స్పదంగా వ్యవహారించే వారి దగ్గర, అసలు కొనరాదన్నారు. 

నకిలి విత్తనాలను స్వాధీనం చేసుకొని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి ఛట్టరీత్యా చర్యలు తీసుకుంటారని తేలియజేసారు.ఈ కార్యక్రమములో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.