calender_icon.png 6 November, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిలిప్పీన్స్‌లో కల్మేగి బీభత్సం

06-11-2025 12:00:00 AM

-తుఫాన్‌కు 100 మందికి పైగా మృతి

-ఊర్లు విధ్వంసం.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు

-సహాయక చర్యల్లో కుప్పకూలిన హెలీకాప్టర్

మనీలా, నవంబర్5: ఫిలిప్పీన్స్‌లో కల్మేగి తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్ర భావంతో భారీ జన, ఆస్తి నష్టం సంభవించింది. ఈ తుఫాన్ విధ్వంసం అంచనాలకు అందని విధంగా ఉందని అక్కడి అధికారు లు పేర్కొంటున్నారు. అధికారకంగానే 66 మంది ప్రజలు మరణించారు. గుయిమారస్ ప్రావిన్స్‌లోని జోర్దాన్ పట్టణంలో 160 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీయడంతో నగరంలోని వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ గాలులతో పాటు కుంటు పోత వర్షంతో నగరం జలమయమైంది. పెద్ద ఎత్తున వరదలు రావడంతో 100 మం ది వరకు చనిపోయారు. చాలామంది వరదలకు కొట్టుకుపోయారు. జోర్దాన్ సిటీ, అగు సాన్ డెల్ సుర్ ప్రావిన్స్‌లో పడిన వర్షానికి వేలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవటం.. ఇళ్లు కూలిపోవడం తో జనం రోడ్డు పాలయ్యారు.వారి బాధ వ ర్ణనాతీతం. వర్షం, గాలుల నుంచి తలదాచుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.

కాగా తుఫాన్‌కు 66 మంది మృతి చెందినట్లు, మరో 30 మంది ఆచూకీ లేదని,వారి కోసం గాలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సహాయ చర్యల్లో భాగంగా ఐదుగురు సిబ్బందితో వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ లోరె టో పట్టణం సమీపంలో కూలిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆర్మీ ప్రకటించింది. దీంతో సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఫిలిప్పీన్స్ దేశంలో ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 20 తుఫాన్లు చుట్టుముట్టాయి.