calender_icon.png 2 August, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య, విద్యా రంగాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది

28-07-2025 12:52:00 AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, జూలై 27 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపా రు. కరీంనగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కేంద్ర నిధులతో ని ర్మించిన ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ భవనాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు.

ఆ భవనమంతా కలియ తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులతో సమావేశమై మౌలిక సదుపాయల కల్పన, సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్య, వైద్యా రంగాలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారని, అందులో భా గంగానే కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 23 కోట్ల 75 లక్షల కేంద్ర నిధులతో ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ నూతన భవనాన్ని నిర్మించామని, మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.

ఈ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది నియా మకం, మెయింటెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, వాటిని వెంటనే సమకూర్చి క్రిటికల్ కేర్ బ్లాక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు సకాలంలో నిధులు విడుదల చేసి సేవలకు అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. దేశం అభివృద్ధికి విద్య, వైద్యం చాలా ముఖ్యమని, అందుకే మోదీ ప్రభు త్వం ఈ రంగాలకు అత్యంత ప్రాముఖ్యనిస్తోందని అన్నారు.

యూపీఏ హయాంలో విద్యా రంగానికి కేంద్రం 68 వేల 728/కోట్లు కేటాయిస్తే... ఈ ఒక్క ఏడాదే మోదీ సర్కార్ 1 లక్షా 28 వేల 650/కోట్ల రూపాయలు కేటాయించిందని అ న్నారు. వైద్య రంగానికి యూపీఏ హయాంలో కేంద్ర ఆరోగ్య బడ్జెట్ 37 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, కానీ మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ వైద్య రంగానికి కేటాయించిన బడ్జెట్ 1 లక్షా 35 వేల కోట్ల రూపాయలని అన్నారు.

మోదీ ప్రభుత్వానికి పేదలపట్ల, వారి ఆరోగ్యంపట్ల ఉన్న శ్రద్ధకు నిదర్శనమే ఈ బడ్జెట్ కేటాయింపు అని తెలిపారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ వంటి విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చాక ప్రజలపై భారం చాలా తగ్గిందని, నూటికి 39 రూపాయల 40 పైసలు మాత్రమే భారం పడుతోందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులున్న వారికైతే 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతోందని తెలిపారు.

వైద్య రంగంలో తీసుకువచ్చిన అభివృద్ధి, విప్లవాత్మక మా ర్పులు కూడా చాలా ఉన్నాయని, గత 11 ఏళ్లలో ఎయిమ్స్ సంఖ్య 30కి పెరిగాయని అన్నారు. గత ప్రభుత్వాల పాలన నాటి కి దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఉండేవని, మోదీ పాలనలో 30కి పెరిగాయని అన్నారు. 2014 లో 387 ప్రభుత్వ మెడికల్ కాలేజ్లు మాత్రమే ఉంటే...నేడు వాటిని రెట్టింపు (780) చేశారని, ఎంబీబీఎస్ సీట్లు గతంలో 51 వేలు మా త్రమే ఉండేవని, మోదీ వచ్చాక మెడికల్ సీట్ల సంఖ్యను 1 లక్షా 18 వేలకు పెంచారని అన్నారు.

గతంలో 31 వేల పీజీ సీట్లు మాత్రమే ఉంటే నేడు 74 వేలకుపైగా సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కో మటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వా కడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జి జి హెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, డి ఎం హెచ్ ఓ వెంకటరమణ, తదితరులుపాల్గొన్నారు.