28-07-2025 12:50:42 AM
-బెల్లంపల్లి క్రీడాకారుడు ఎంపిక
బెల్లంపల్లి, జూలై 27: హైదరాబాద్‌లోని ఎంఎస్‌కే ప్రసా ద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో యూత్ స్టార్స్ క్రికెట్ లీగ్ ( వైఎస్‌సీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఎంపిక పోటీలలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్రీడాకారుడు ప్రతిభ కనబరిచి తెలంగాణ క్రికెట్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు.
తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా రెడ్డి రిత్విక్ చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి అండర్ 14 విభాగంలో క్యాంప్‌కు ఎంపికయ్యాడు. రిత్విక్‌కు మూడు సంవత్సరాల పాటు స్పాన్సర్స్‌షిప్ లభించనుంది. రెడ్డి రిత్విక్‌ని పలువురు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.