calender_icon.png 1 August, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి

30-07-2025 05:21:05 PM

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్..

బాన్సువాడ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణ కేంద్రంలో సిపిఐ కార్యాలయం ప్రక్కన గల నాయి బ్రాహ్మణ ఫంక్షన్ హాల్ లో సిపిఐ బాన్సువాడ మండల నాల్గవ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్ రాములు అధ్యక్షత వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ విచ్చేసి మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆమె ఆరోపించారు.

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కొరకు సిపిఐ పార్టీ శ్రేణులు ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేటర్లకు అనుకూలంగా చట్టాలలో సవరణ చేసి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మారుస్తానని అనుకున్న బిజెపి ఆర్ఎస్ఎస్ పరివారశక్తులు ప్రజలు ఎన్నికలలో బుద్ధి చెప్పారని అన్నారు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, బీహార్లో నితీష్ కుమార్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ జీవో తీసుకురావడం విచారకరమని దీనిని వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఆ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు మట్టి కరిపించారని ఆయన పేర్కొన్నారు.రానున్న కాలంలో సిపిఐ పార్టీ బలోపేతంకు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నాయకులు సభ్యులు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్ రాములు, డి శంకర్, అశోక్ గౌడ్, టి శ్రీనివాస్, సర్దార్, శివాజీ, రాజు, భూమయ్య, సాయిలు, హనుమాన్లు, అంజయ్య, సుశీల, గంగామణి, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.