30-07-2025 05:17:35 PM
ఆర్యవైశ్య మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు
తుంగతుర్తి (విజయక్రాంతి): ఆర్యవైశ్యుల హక్కుల సాధన కోసమే ఆర్యవైశ్య రాజకీయ రణభేరి విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు(President Vempati Venkateswarlu) అన్నారు. బుధవారం మండల కేంద్రముకు మొదటిసారి రావడంతో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న ఆధ్వర్యంలో, సంగం సభ్యులు ర్యాలీతో, టపాకాయలు పేల్చి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఆర్యవైశ్యుల దామాషా ప్రకారం రాజకీయ రంగంలో, ఎన్నికల్లో పోటీ చేయుటకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతి కొరకు తక్షణమే ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 3 నాంపల్లిలో జరిగే రాజకీయ రణభేరి సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బండారు రాజా, జిల్లా సంయుక్త కార్యదర్శి నూనె . నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు తాటికొండ సీతయ్య బండారు దయాకర్, ఓరుగంటి శ్రీనివాస్, తల్లాడ కేదారి, గుమ్మడవెల్లి సోమన్న, ఈగ.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి గుండా శ్రీను, కోశాధికారి మా శెట్టి వెంకన్న, గోపారపు సత్యనారాయణ, గుమ్మడవెల్లి శ్రీనివాస్, ఈగ శ్రీను, తల్లాడ శ్రీనివాస్, తల్లాడ శ్రీను, ఓరుగంటి సుభాష్ ,గుండా వెంకన్న, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.