calender_icon.png 2 January, 2026 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాలాల్ జయంతిని కేంద్రం నిర్వహించాలి

29-12-2025 01:06:10 AM

ఎంపీ డీకే అరుణకు బంజారా సంఘం వినతి

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 సంత్ సేవాలాల్ జయంతిని కేంద్ర ప్ర భుత్వం అధికారికంగా నిర్వహించేలా చొరవ చూపాలని బీజేపీ ఎంపీ డీకే అరుణను రాష్ట్ర బంజారా సేవా సం ఘం నాయకులు కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని డీకే అరుణ ఇంటి వద్ద నాయకులు కలిసి ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశం గు రించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడంతో ఇందుకు ఆమె సాను కూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

డీకే అరుణను కలిసినవారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమ్లాల్, ఆల్ ఇండియా బంజారా సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.మోహన్ సింగ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు పాండురంగ నాయక్, హైకోర్టు న్యాయవాది జోగ్రామ్, సెంట్రల్‌వర్సిటీ రిజిస్టర్ పీహెచ్ నాయక్, బంజారా సుగాలి లంబాడి వెల్ఫేర్ ట్రస్ట్, ఓయూ వర్సిటీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.