calender_icon.png 18 October, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది జట్టు కూర్పే సవాల్

18-10-2025 12:54:17 AM

-ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల  వ్యూహమేనా ?

-పెర్త్‌లో ప్లేయింగ్ 11పై సస్పెన్స్

పెర్త్, అక్టోబర్ 17 : అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్,ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ఆదివారం నుంచే తెరలేవబోతోంది. వరల్డ్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ పిచ్‌లలో ఒకటిగా పేరున్న పెర్త్ వేదికగా తొలి వన్డే జరగబోతోంది. ఇప్పటికే ఆసీస్ గడ్డపై ప్రాక్టీస్ సెషన్‌లో బిజీబిజీగా గడుపుతున్న టీమిండియా పెర్త్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. రోహిత్,కోహ్లీ రీఎం ట్రీ జట్టుకు మేజర్ అడ్వాంటేజ్. అయితే ఈ మ్యాచ్‌కు భారత్ తుది జట్టు ఎంపికపై సస్పె న్స్ కొనసాగుతోంది.

ఫైనల్ కాంబినేషన్‌లో ఎవరికి చోటు దక్కుతుందవేది ఆసక్తికరంగా మారింది. ఒకవిధంగా కోచ్ గంభీర్,కెప్టెన్ గిల్‌కు తుది జట్టు ఎంపికే పెద్ద సవాల్‌గా మారింది. ఎందుకంటే దాదాపు ప్రతీ ప్లేస్ కూ అత్యుత్తమ ఆటగాళ్లే అందుబాటులో ఉన్నారు. అదే ఇప్పుడు తలనొప్పిగా మారిం ది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా పెర్త్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అను కూలంగా ఉంటుందని అంచనా. పిచ్ ను చూస్తే మాత్రం గడ్డి తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల మధ్య పరుగుల వరద పారే అవకాశముంది.

ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పును పరిశీలిస్తే ఓపెనర్లుగా కెప్టెన్ గిల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. విరాట్ కోహ్లీ వన్ డౌన్‌లో ఖా యం. ఎందుకంటే ఈ ప్లేస్‌లో ఆడే కోహ్లీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యాటర్‌గా రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు. ఇక నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఐదో ప్లేస్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. ఇదిలా ఉంటే హార్థిక్ పాండ్యా గాయపడడంతో జట్టులో చోటు దక్కించుకున్న తెలుగుతేజం నితీశ్ కుమా ర్‌రెడ్డి ఆరో ప్లేస్‌లో ఆడే అవకాశాలున్నాయి. తన ప్లేస్‌ను నిలబెట్టుకోవడా నికి నితీశ్‌కు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొ చ్చు. అలాగే బౌలింగ్ ఆల్ రౌం డర్‌గా అక్షర్ పటేల్ ఏడో స్థానం లో ఆడతాడు. అక్షర్ కూడా బ్యాట్‌తో కూడా రాణిస్తుండడంతో లోయర్ ఆర్డర్‌లో కీలకపాత్ర పోషించే అవకాశముంది.మరో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు ప్లేస్ దక్కొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కుల్దీప్ అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. 

అటు స్టార్ పేసర్ బుమ్రా లేకపోవడంతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్ ఎటాక్‌ను లీడ్ చేయనున్నాడు. సిరాజ్‌తో పా టు అర్షదీప్‌సింగ్‌కు ప్లేస్ ఖాయం. అయితే మూడో పేసర్‌గా హర్షిత్ రాణ్, ప్రసిద్ధ కృష్ణల్లో ఒకరికే చోటు దక్కుతుంది. ఆసీస్‌లో ప్రసిద్ధ కృష్ణకు మంచి రికార్డే ఉన్నప్పటకీ..గంభీర్ శిష్యుడిగా పేరున్న హర్షిత్ రా ణాను తీసిపారేయలేం. మొత్తం మీద తొలి వన్డేలో తుది జట్టు ఎంపిక టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కాస్త సవాల్‌గానే మారింది. కాగా పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆసీస్‌తో తొలి వన్డేకు భారత్ తుది జట్టు (అంచనా):

శుభమన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్‌రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ/హర్షిత్ రాణా