03-01-2026 12:00:00 AM
అకాడమీని ప్రారంభించిన మేయర్, సినీ నటి దివివాద్య
హైదరాబాద్, జనవరి ౨ (విజయక్రాంతి) : హైదరాబాద్ నగరంలోని మణికొండలో స్పామ్(సౌమ్యాస్ పార్లర్ అండ్ అకాడమీ ఆఫ్ మేకప్) యూనిసెక్స్ అండ్ మేకప్ అకాడమీని శుక్రవారం వ్యవస్థాపకురాలు డెరం గుల సౌమ్య, బాబీతో కలిసి నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సినీ నటి దివి వాద్య హాజరయ్యారు. స్పామ్ యూనిసెక్స్ సలోన్ అండ్ మేకప్ అకాడమీ ప్రీమియం సలోన్ సేవలతో పాటు ప్రొఫెషనల్ మేకప్, బ్యూటీ శిక్షణను అందిస్తోంది.
ఆధునిక సాంకేతికతలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణా విధానాలతో వి ద్యార్థులను తీర్చిదిద్దడం ఈ అకాడమీ ప్రధా న లక్ష్యం. ఇది కేవలం బ్యూటీ సెంటర్ మా త్రమే కాకుండా, మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని స్థాపించిన సామాజిక బాధ్యత కలిగిన వేదికగా నిలుస్తోంది.ఈ సం దర్భంగా సినీ నటి దివి మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవంలో భాగస్వామినవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఒం టరి మహిళలు, వితంతువులకు శిక్షణ ఇచ్చి, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచన నిజంగా ప్రశంసనీయన్నా రు. అకాడమీ వ్యవస్థాపకురాలు సౌమ్య మా ట్లాడుతూస్వంతంగా నిలబడాలనుకునే ప్రతి మహిళకు మద్దతు ఇవ్వాలనే ఆశయంతో ‘స్పామ్’ను ప్రారంభించామన్నారు.
అకాడ మీ ద్వారా తక్కువ ఖర్చుతో సర్టిఫికేషన్ కోర్సులు, ప్రాక్టికల్ ట్రైనింగ్, మెంటార్‌షిప్ అందించబడతాయన్నారు. ఇవి మహిళలు వృత్తిపరమైన నైపుణ్యాలు సాధించేందుకు, ఆర్థిక స్వావలంబన పొందేందుకు,ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు దోహదపడ తాయన్నారు. ఈ ప్రారంభంతో స్పామ్ మహిళా సాధికారతకు బాటలు వేసింది.