25-12-2025 01:15:28 AM
ఎస్టీయూటీఎస్ నేతల డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాం తి): టీచర్ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించి, సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఎస్టీయూటీఎస్ నేతలు డిమాండ్ చేశారు. బుధ వారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి,
ఎస్టీ యూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.సదానందంగౌడ్, జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈజూ పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్, సరెండర్ లీవ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు సాబేర్ అలి, ఏవీ సుధాకర్, ప్రసాద్, కరుణాకర్‌రెడ్డి, రంగారావు, రవీంద్ర, శీతల్‌చౌహాన్ పాల్గొన్నారు.