15-12-2025 05:20:57 PM
- సర్పంచ్ ఎన్నికల కౌంటింగులో సమగ్ర విచారణ జరపాలి..
- ప్రత్యర్థి రవికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి..
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏరుకొండ అబ్బయ్య..
మర్రిగూడ (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ లో అవకతోకలు జరిగిన విషయంలో సమగ్ర విచారణ చేపట్టి రవికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బరిలో నిలిచిన అభ్యర్థి ఏర్కొండ అంజయ్య అన్నారు. సోమవారం ఎన్నికలలో జరిగిన అవకతవకలపై కలెక్టర్, డిపిఓ కార్యాలయాలలో వినతి అందజేసి మాట్లాడారు. మర్రిగూడ మండలం, మేటిచందాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల కౌంటింగులో అవకతవకలు జరిగినందున సమగ్ర విచారణ జరిపి రీ ఎలక్షన్/రీ కౌంటింగు నిర్వహించుటకు, ఓడిపోయిన అభ్యర్తి పదం రవితో సర్పంచిగా ప్రమాణం స్వీకారం చేయించకుండా ఆపుదల చేయాలని అన్నారు. నాకు ఉంగరం గుర్తు కేటాయించారు.
నాతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతులో పదం రవి అను వ్యక్తి కూడా పోటీ చేయగా అతనికి కత్తెర గుర్తు కేటాయించారు. 11వ తేదీన ఓటింగు నిర్వహించిన ఎన్నికల అధికారులు అదే రోజు మధ్యాహ్నాం ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. సర్పంచికి పోటీ చేసిన మా ఇద్దరి సమక్షములో మేము ఇద్దరము కౌంటింగు కేంద్రములో ఉన్నపుడు మాత్రమే బ్యాలెట్ పేపర్ల బాక్సులను తెరిచి లెక్కింపు ప్రారంభించాలని నిబంధన ఉన్నప్పటికీ లెక్కింపు అధికారులు నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పథకం ప్రకారం మేము లేకుండా చూసి ఒకటవ (1వ వార్డు బ్యాలెట్ బాక్సును తెరిచి నేను లేకుండా ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇది తెలిసి నేను వెంటనే లెక్కింపు గదిలోకి వెళ్లగా అప్పటికే లెక్కింపు కొనసాగిస్తూ మద్యలో రెండు సార్లు కేవలం లెక్కింపు గదిలోనే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. విద్యుత్తు లేని సమయంలో నాకు పడ్డ ఉంగరం గుర్తు ఓట్లను తీసేసి ఎలాంటి ఓట్లు లేని ఎంటి బ్యాలెట్ పేపర్లను కలిపి లెక్కింపు కొనసాగించారు.
మా గ్రామంలో గానీ ఎన్నికల కౌంటింగు కేంద్రం పక్కన గానీ ఎక్కడా కూడా విద్యుత్తు సరఫరా కాకుండా కేవలం ఓట్ల లెక్కింపు కేంద్రంలో విద్యుత్తు సరఫరా బందుకాగా నేను విచారణ చేసుకోగా ఉద్దేశ్యపూర్వకంగా పథకం ప్రకారమే ఎన్నికల అధికారులు, నా ప్రత్యర్తి అధికార పార్టీ మద్దతు అభ్యర్థి పదం రవితో చేతులు కలిపి కరెంటు బందు చేసి నా కండ్లుగప్పి నేను సర్పంచిగా గెలువొద్దనే కుట్రతో కరెంటు బందు చేసినట్లు నాకు నిర్ధారణ అయ్యింది. నేను వెంటనే గుర్తించి అభియోగం తెలిపి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి పట్టించుకోకుండా సంబంధిత అధికారులు నా ప్రత్యర్తికి అనుకూంగా వ్యహరించి లెక్కింపును ముగించి నా ప్రత్యర్తి పదం రవి అను అభ్యర్థి ఈ ఓట్లతో గెలుపొందినట్లుగా ప్రకటించారు. ఎన్నికలలో అవకతవకలను సృష్టించి ఓడిపోయిన పదం రవికి సర్పంచ్ ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేసి సమగ్ర విచారణ చేపట్టి రీకౌంటింగ్ లేదా రీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా ఉన్నత అధికారులను కోరారు. వినతి అందజేసిన వారిలో అనంతల వెంకటేష్ గౌడ్, చిలువేరు జంగయ్య, ఏరుకొండ నరేష్ తదితరులు ఉన్నారు.