23-04-2025 10:44:29 PM
కామారెడ్డి (విజయక్రాంతి): లింగంపేట మండలంలో జరుగుతున్న రైతు సదస్సులలో రైతులు సమర్పించిన దరఖాస్తులను క్యాటగిరి వారిగా పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. బుధవారం లింగంపేట మండల స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రైతు సదస్సుల దరఖాస్తుల పొందుపరచడం తీరును కలెక్టర్ పరిశీలించారు. మండలంలో ఇప్పటి వరకు 10 రెవిన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు, ఇప్పటివరకు పలు రకాల సమస్యలపై 1080 దరఖాస్తులు రావడం జరిగాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సదస్సుల అనంతరం దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.