24-04-2025 12:00:00 AM
జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు
కాగజ్‌నగర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): సహకార బ్యాంకుల అభివృద్ధి ద్వారా సహకార సేవలు విస్తరించడం జరుగుతుందని జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని యూనివర్సల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో జిల్లా సహకార ఆడిట్ అధికారి షేక్ మహమూద్, బ్యాంకు చైర్మన్ వినయ్ కుమార్, సి.ఈ.ఓ. కె.వి.ఎస్. ఎన్. మూర్తి, బ్రాంచ్ మేనేజర్ ఎం. బాజీరావులతో కలిసి బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి మాట్లా డుతూ సహకార బ్యాంకులను అభివృద్ధి చేసేందుకు సహకార సేవలను మరింత విస్తృత పరిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కమర్షియల్ బ్యాంకులతో సమానంగా అన్ని రకాల సేవ లు, తక్కువ వార్షిక అద్దెకు లాకర్ల సేవలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి కొరకు బ్యాంకు తోడ్పాటు అందిస్తుం దన్నారు. త్వరలోనే బ్యాంకు ఆన్‌లైన్ సేవ లు, గూగుల్ పే, ఫోన్ పే సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, లావాదేవీలు సులభతరం కానున్నాయని తెలిపారు.