31-12-2025 12:19:07 AM
నిజామాబాద్ డిసెంబర్ 30:(విజయక్రాంతి): నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముగపాల్ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్నటువంటి హరికృష్ణ కానిస్టేబుల్ పిల్లలు మధి మోహన్ దుర్గ, మధి వినమ్ర లు స్విమ్మింగ్ లో రాష్ట్రస్థాయిలో అనేక పథకాలు సాధించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, క్రీడల్లో జిల్లాకి పేరు తెచ్చిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు , పథకాలు సాధించిన క్రీడాకారులను ఆయన అభినందించరూ.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాదుకు క్రీడల్లో పథకాలు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని , క్రీడాకారుల పట్టుదల కృషి వల్ల రాష్ట్రంలో నిజామాబాదుకు ఎంతో మంచి పేరు వచ్చిందని ఇదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్విమ్మింగ్ పోటీలలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక పథకాలు సాధించడానికి మరింత కృషి చేయాలని క్రీడాకారులకు సిపి సూచించారు.
అలాగే క్రీడల పట్ల సిబ్బందికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి ఎలాంటి సందేహాలు ఉన్నను తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బంది అందరూ క్రీడలు స్విమ్మింగ్ పట్ల సమయం కేటాయించాలని తగు సూచనలను సిపి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి బస్వా రెడ్డి , నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సౌత్ రూరల్ సి. ఐ శ్రీ ఎన్.సురేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు..