06-01-2026 12:07:17 AM
మాగనూరు, జనవరి 5: అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు కుల మతాల భేదాలు లేకుండా ఒకే రకము దుస్తులు ఉండుటకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందని మాగనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ సర్పంచ్ జనార్ధనమ్మ అన్నారు . సోమవారం మాగనూరు మండల కేంద్రంలోని 4 అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు ఉచిత దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జనార్ధనమ్మ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దింటి రాజు, మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాకిటి శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రపాణి రెడ్డి, అంగన్వాడి టీచర్లు సత్యమ్మ, శోభ, జగదీశ్వరి ,తులసి, ఆయలు తదితరులు పాల్గొన్నారు.