calender_icon.png 8 January, 2026 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నయ్యగౌడ్‌కు ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

06-01-2026 12:07:49 AM

సుల్తానాబాద్, జనవరి 5 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్  తండ్రి అంతటి రాయలింగు గౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం విచ్చేసిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ సోమవారం అంతటి అన్నయ్య గౌడ్ నివాసానికి వెళ్లి అన్నయ్య గౌడ్ ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ గజ బింకార్  జగన్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, చింతల రాజు, దున్నపోతుల రాజయ్య, దుగ్యాల సంతోష్ రావు, న్యాతరిదేవేందర్ , గాదాసు రవీందర్, నోముల శ్రీనివాస్ రెడ్డి ,సజ్జద్ తదితరులున్నారు.