13-07-2025 01:33:30 AM
మీర్‌పేట్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, జులై 12 : ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ కృష్ణనగర్ కాలనీలో రూ. 14 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉం టానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు. డివిజన్ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేకు మరియు డివిజన్ నాయకులకు కార్పొరేటర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మల్లారెడ్డి, మల్లేష్ గౌడ్, బాలయ్య గౌడ్, రాజు, రామకృష్ణ, చారి, అంజయ్య గౌడ్, ఉల్లెం బాలరాజు, దేవేందర్ కుమార్, నిసార్ అహ్మద్ గోరి తదితరులు పాల్గొన్నారు.