calender_icon.png 29 September, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ హయాంలోనే దేశం సమగ్ర అభివృద్ధి

29-09-2025 12:57:55 AM

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశం సమగ్ర అభివృద్ధి చెందుతున్నదని ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం పిలుపుమేరకు ఆదివారం ముషీరాబాద్ లో సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ముషీరాబాద్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ తో కలిసి చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని పనిచేస్తూ అన్ని వర్గాలకు ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయ కులు  కంచి ముదిరాజ్, నాయకులు లక్ష్మణ్, సత్యనారాయణ, అశోక్  పాల్గొన్నారు.