calender_icon.png 29 September, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల మందపై చిరుత దాడి

29-09-2025 12:58:35 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తుంది. గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మేడిపల్లి గ్రామంలో ఆదివారం ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మేడిపల్లి గ్రామం లోని గౌరారం అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరులు గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. అయితే గొర్రెల మందపై చిరుత పులి శనివారం రాత్రి దాడి చేసింది.

ఒక గొర్రెను చంపి వేసిందని గొర్రెల కాపరి సంతోష్ తెలిపారు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమా చారం అందించడంతో ఆదివారం ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పులి సంచారం చేసిన ఆనవాలను గుర్తించారు. గొర్రెను చంపి తిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించారు. ఎఫ్ ఆర్ ఓ హేమచందన ను వివరణ కోరగా చిరుత పులి సంచారం చేసి నా మాట వాస్తవమేనని తెలిపారు. గౌరారం అటవీ ప్రాంతం లో చిరుతలు ఉన్న విషయం వాస్తవమేనన్నారు. మేడిపల్లి, గౌరారం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్రెల కాపరులు అటవీ ప్రాంతంలోకి సంచరించవద్దని తెలిపారు.