calender_icon.png 21 September, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ నిర్మాణంలో యువత కీలకం

21-09-2025 12:38:05 AM

-కార్డినల్ పూల ఆంథోనీ

-ఘనంగా సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ తొలి స్నాతకోత్సవం

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 20(విజయక్రాంతి): నైపుణ్యాలు, సమగ్రత, సృజనాత్మకతను అలవరచుకుని, పరిశ్రమకు అవసరమైన నిపుణులుగా యువత ఎదగాలని హైదరాబాద్ ఆర్చ్ బిషప్, కార్డినల్ పూల ఆంథోనీ పిలుపునిచ్చారు. సామ ర్థ్యం, కరుణ, అంకితభావంతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.

సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ శనివారం సాయంత్రం తమ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన తొలి స్నాతకోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్డినల్ పూల ఆంథోనీ మాట్లాడుతూ, అవకాశాలతో నిండిన విశాల ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు. కళాశాలలో నేర్చుకున్న విద్యతో పాటు, మానవతా విలువలను పెం పొందించుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలి  అని విద్యార్థులను ప్రోత్సహించారు.

హైదరాబాద్ ఆర్చిడయోసెస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్న ఆయన, విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఆంథోనీ వినయ్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యా నైపుణ్యంతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తమ కళాశాల కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.  వైస్-చైర్మన్ యెరువా బాల షోరీ, కార్యదర్శి రెవరెండ్ ఫాదర్ గువ్వల ఆంథోనీ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.