06-11-2025 12:08:43 AM
అమీన్ పూర్, నవంబర్ 5 : అమీన్ పూ ర్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి నివాసంలో వారి కుమారుడు తుమ్మల రుశ్వంత్ రెడ్డి కన్నెస్వామి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవం గా నిర్వహించారు.
వందలాదిమంది అయ్య ప్ప స్వాముల శరణు ఘోషతో పూజ స్థలం మారు మొగింది. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాములందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప స్వాము లు, మాజీ కౌన్సిలర్లు,సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.