25-09-2025 12:51:59 AM
- మున్సిపల్ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు
- నిరసనకు సిద్ధమవుతున్నఉద్యోగ సంఘాలు
- ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కు ఫిర్యాదు
-మాజీ కౌన్సిలర్ వ్యాఖ్యలపై తీవ్ర రూపం దాల్చిన చర్చ
- అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి : విజయ్ కుమార్ టిజిఓ జిల్లా అధ్యక్షులు
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ప్రజా సేవకులం.. ఎల్లప్పుడూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకునేలా శాహాయశక్తులుగా కృషి చేస్తాం.. సమయపాలన పాటిం చకుండా పనులు చేసి ప్రగతిని పరుగులు పె ట్టించేలా ప్రజా పాలన నిర్ణయాలను అవగ తం చేసుకుంటూ అద్భుతంగా పథకాలను అమలు చేస్తాం.. చేస్తున్నాం.. ఎంతైనా పని చేస్తాం.. ఎవరు పడితే వారు ఎలా పడితే అ లా మాట్లాడితే పడం.. అంటూ మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ గట్టిగా చెబుతుంది. ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు.
మున్సిపల్ కమిషనర్ పై మాజీ కౌన్సిలర్ గరం గరం...
మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పై ఓ మాజీ కౌ న్సిలర్ అసభ్య పదజాలంతో దూషించినట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఈ విషయంపై మున్సిపల్ సిబ్బంది ఏకతాటి పైకి వచ్చి నల్ల బ్యాడ్జీలు ధరించి జి ల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ లకు రాతపూర్వకం గా ఫిర్యాదు చేశారు. గత రెండు రోజుల క్రి తం నుంచి ఈ విషయంపై పట్టణంలో చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. మాజీ కౌన్సిలర్ కట్ట రవి కిషన్ రెడ్డి తమను ఫోన్లో ఇష్టం సా రంగా మాట్లాడాలని ఆఫీసుకు వచ్చి కార్యాలయ సిబ్బందితో దూషించారని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా అ యితే ఎలా విధులు నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఏకతాటి పైకి వస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిక్షణం పనిచేస్తున్న ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజు రోజుకు చర్చ వుపందుకుంటుంది.
తీవ్రంగా ఖండిస్తున్నాం...
మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీజీవో జిల్లా అధ్యక్షులు విజయకుమార్ అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కి ఫిర్యా దు చేయనన్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగులపై ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటివి జరగకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా ఉ న్నతాధికారులకు పూర్తిస్థాయిలో చిత వ్యా ఖ్యలకు సంబంధించిన అంశాలను వివరిస్తామని స్పష్టం చేశారు.
ఏకతాటి పైకి వస్తున్న ఉద్యోగ సంఘాలు..
గెజిటెడ్ అధికారిపైనే ఇలా మాట్లాడితే ఎలా అంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల్లో చర్చ తీవ్ర రూపం దాల్చుతుంది. రోజురోజుకు ఈ అం శం మరింత పదనెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు చేరినట్లు తెలుస్తుంది.