01-01-2026 12:16:25 AM
నల్గొండ టౌన్, డిసెంబర్ 31: నిరుపేదలకు రోడ్డు వెంట చిరు వ్యాపారం చేస్తూ అక్కడే నిద్రించే వారికి నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో బుధవారం చలి నుండి రక్షించేందుకు దుప్పట్లు అందజేశారు . కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన వైద్య విద్యార్థులు ఉచితంగా దుప్పట్లు అందజేసి మానవత్వాని చాటుకున్నారు నల్గొండ జిల్లా ఎన్‌ఎమ్‌ఓ(NMO) యూనిట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని డా. రత్న బాలరాజు, డా. అశోక్ దేవ్. వై, డా. పవన్ అఖిలేష్. లు నిర్వహించారు.
విద్యార్థులు స్వయంగా సేకరించిన డబ్బులతో దుప్పట్లు, స్వెటర్లు, దుస్తులను శీతాకాల తీవ్రతను ఎదుర్కొంటున్న నిరాశ్రయులకు పంపిణీ చేశా రు. ఇటీవల ఇల్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక పేద కుటుంబానికి ఆర్థికసహాయం, దుప్పట్లు అందజేశారు కార్యక్రమంలో కామినేని వైద్య విద్యార్థులు పాల్గొన్నారు