calender_icon.png 10 September, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిధి దాటుతున్న పంతుళ్లు..

10-09-2025 12:00:00 AM

-విద్యాబుద్ధులు నేర్పల్సిన వారే వెకిలి చేష్టలు... 

-ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెస్తున్న కొందరి అసభ్యకర ప్రవర్తనలు

-ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లు కటకటాల పాలు... 

ఆదిలాబాద్, సెప్టెంబర్ ౯ (విజయక్రాం తి): మాతృదేవోభవ.. పితృదేవోభవ... ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు... సమాజంలో ఉన్న అన్ని వృత్తుల కంటే పవిత్రమైన, గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నాటి నుండి నేటి వరకు సమాజంలో  గురువులకు ఎంతో గౌరవం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువులకు అ స్థానాన్ని కల్పిస్తే... కొందరు ఉపాధ్యాయుల వెకిలి చేష్టల వల్ల ఉపాధ్యా య వృత్తికే మచ్చ తెచ్చిపెడుతూ ఆ వృత్తిని అపవిత్రం చేస్తున్నారు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు పంతుళ్ళు గుడిగా భావించే బడిలోనే ప్రేమ పాఠాలు బోధిస్తు పక్కదారి పడుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన గురువులే విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కటకటాల పాల వుతున్న ఘటనలు ఇటీవల తరుచుగా వెలు గు చూడటం విద్య రంగంలో ఆందోళన కల్గిస్తున్నాయి. దీంతో సమాజంలో గురువుకు ఉన్న గౌరవం మసకబరుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులపై పెరిగిపోతున్న ఫోక్సో కేసులతో ఉపాధ్యాయులు జైలు పాలు అవుతున్న ఘటనలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. 

ఆన్లైన్ క్లాసులు, సెల్‌ఫోన్‌తో ఘటనలు

కరోనా కాలం తర్వాత విద్యారంగంలో వచ్చిన మార్పుతో పాటు ఆన్లైన్ క్లాసుల కారణంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయుల మధ్య సఖ్యత పెరిగింది. సెల్‌ఫోన్‌ల వాడకంతో పాఠలను బోధించే ఉపాధ్యాయులు, సెల్ ఫోన్‌ల ద్వారా వారివారి స్వంత అభిప్రాయాలను విద్యార్థినిలతో వెలిబుచ్చుకోవడానికి సులభతరం అయింది. దీంతో ఇరువురి మధ్య చాటింగ్‌లు, ఇతరత్రా వ్యవహారాలు సైతం కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదువును సులభతరం చేసేందుకు ఉపయోగించాల్సిన సెల్ ఫోన్ లు అటు కొందరు ఉపాధ్యాయులను ఇటు విద్యార్థినులను చెడుతోవ పట్టిస్తున్నాయి. దీం తో సభ్యసమాజం తల దించుకునే అసభ్యకర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. 

పలువురు ఉపాధ్యాయులపై ఫోక్సో కేసులు

జిల్లాలో ఇటీవల కాలంలో విద్యార్ధిని ల ను వేధించుతున్న ఘటనలో ఉపాధ్యాయుల పై సైతం ఫోక్సో కేసులు నమోదు అవుతున్నాయంటే సభ్య సమాజం ఎటువైపు పోతుం దోననే భయాందోళన నెలకొంది. ఇటీవల జిల్లాలోని పలు పాఠశాలల టీచర్‌లపై నమో దు అయిన ఫోక్సో కేసులు...

-తాంసి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుపై...

-కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడుపై.... 

-ఆదిలాబాద్‌లోని స్పోర్ట్ స్కూల్‌లోని బాక్సింగ్ కోచ్‌పై...

-ఇంద్రవెళ్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఓ టీచర్‌పై.. 

-మావల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని పై...

-నేరడిగొండ పాఠశాలలో ఉపాధ్యాయుడుపై.

-ఉట్నూర్ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడుపై ఇలా పలు పాఠశాలల్లోని టీచర్ లపై ఫోక్సో కేసులు నమోదై జైలుపాలైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

తప్పుడు కేసులతో ఉపాధ్యాయులకు చెడ్డ పేరు

మరోవైపు జిల్లాలో ఇటీవల ఉపాధ్యాయులపై పెరిగిపోతున్న ఫోక్సో  కేసులతో ఉపాధ్యాయులకు చెడ్డ పేరు వస్తుందని పలు ఉపాధ్యాయ సంఘా ల నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం  కలె క్టర్ రాజర్షి షా ను సైతం కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఫోక్సో కేసుల విషయంలో దృష్టి సారించాలని కోరు తూ వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులపై తప్పుడు ఫోక్స్ కేసులు నమోదవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.