06-11-2025 01:27:13 AM
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 5: కాంగ్రె స్ హయాంలోనే నిరుపేదల సొంతింటి సాకారమవుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి తారామతిపేట్ గ్రామానికి చెందిన పాలకూర్ల కృష్ణవేణి సోమయ్యలకు తొలి విడుదలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. దీంతో వారు ఇంటి నిర్మాణ పనులు త్వరగ పూర్తి చేయడంతో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిం చారు.
ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సాకారమైందన్నారు. గత పాలకులు డబుల్ బెడ్రూమ్‌ల పేరుతో ప్రజలను మభ్య పెట్టి తప్ప.. ఏ ఒక్కరికీ కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మూల మహేష్ గౌడ్, మూల రాజు గౌడ్, మాజీ ఎంపీటీసీ చేగురి వెంకటేష్, భాస్కర్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.