calender_icon.png 6 November, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు

06-11-2025 01:29:23 AM

  1. ఆలయాల్లో పూజలు, సామూహిక వ్రతాలు 

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో భక్తుల సందడి 

ఎల్బీనగర్, నవంబర్ 5 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో బుధవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాలు చేశారు. పవిత్ర కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున ఆలయ కార్యనిర్వహణా ధికారి, చైర్మన్, ధర్మకర్తలు, వేద పండితులు, అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

భక్తులు ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. కాగా, కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో పుష్కరిణి పూజ, అనంతరం ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక సింధూర అభిషేకం నిర్వహించారు. 

ఆలయంలో ప్రముఖుల పూజలు 

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూధన్ రెడ్డి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం.రామకృష్ణారావు, సహాయ కమిషనరు ఏ.చంద్రశేఖర్, దేవాదాయ శాఖ ప్రభుత్వ ప్లీడరు మంగ్లీ నాయక్, టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితరులు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఈవో లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు   పాల్గొన్నారు.

హయత్ నగర్ అయ్యప్ప ఆలయంలో

హయత్‌నగర్‌లోని అయ్యప్ప ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. అయ్యప్ప మాలధారణ దీక్ష స్వాములకు నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్ర మాన్ని కార్పొరేటర్లు కొప్పుల నర్సింహరెడ్డి, నవజీవన్ రెడ్డి, హయత్ నగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి.నాగరాజు గౌడ్, స్థానిక నాయకుడు కళ్లెం రవీందర్ రెడ్డి  ప్రారంభించారు.

ఉజ్జయిని అలంకారంలో  రామలింగేశ్వరస్వామి

దిల్ సుఖ్ నగర్ లోని పీ అండ్ టీ కాలనీలో సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రామలింగేశ్వర స్వామిని అర్చకులు గోధుమపిండితో సహజ సిద్ధ రంగులతో ఉజ్జయిని అలంకారణ చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వర స్వామి అవతారమైన ఉజ్జయిని అలంకారం చేశామని చెప్పారు.

పోచారం, ఘట్‌కేసర్ ..

ఘట్ కేసర్, నవంబర్ 5 (విజయక్రాంతి): పోచారం, ఘట్ కేసర్ మున్సిపల్స్ ప్రాంతాల ప్రజలు కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలు దేవాలయా లకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచారంలోని శ్రీసర్వమంగళ సమేత స్పటికలింగేశ్వస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా దీపారాధన,

ద్వాదశ జ్యోటిర్లింగాలకు భక్తులు అభిషేకాలు జరిపారు. సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే తమ గృహాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు కుటుంబ సభ్యులతో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి.