calender_icon.png 25 December, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎంశ్రీ పాఠశాల ఉపాధ్యాయులకు అవగాహన

25-12-2025 02:57:57 AM

మేడ్చల్, డిసెంబర్ 24(విజయ క్రాంతి): గుండ్ల పోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆవిష్కరణ, డిజైన్, ఆశావాద వ్యాపారం (ఐడిఈ) బూట్ క్యాంపు వాలే డిక్టరీ మూడు రోజులపాటు నిర్వహించారు. పాఠశాల విద్య, సాహిత్య శాఖ ఏఐసిటిఈ, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, వాద్వానీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించారు. ఇన్నోవేషన్ మైండ్ సెట్, డిజైన్ థింకింగ్, ఐడియా ఎగ్జిక్యూషన్, అడ్డంకులను అధిగమించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భాస్కర్, గౌరవ అతిథిగా ఏఐసిటిఈ ఇన్నోవేషన్ సెల్ ప్రాంతీయ సంచాలకులు మయూర్ బోర్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ లోకనాథం, సమన్వయకర్త డాక్టర్ శోభన్, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్  లక్ష్మి, వివిధ విభాగాధిపతులు డాక్టర్ నాగరాజు, ప్రొఫెసర్ రమేష్, డీన్ ప్రసాద్, వెంకటేష్, సౌమ్య, సాయి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.