14-08-2025 12:34:51 AM
ఖమ్మం, ఆగస్ట్ 13 (విజయ క్రాంతి ): ఖమ్మంలో మద్యం సేవించిన కొందరు వ్యక్తులు చేసే చేష్టలు పలువురికి తీవ్ర అసౌకర్యం కలగ చేస్తున్నాయి. వైన్ షాపుల పక్కనే నుంచొని మద్యం సేవించడం. బైక్ పై వెళుతూ బీరు తాగటం. ఎక్కడపడితే అక్కడ ఆగి మద్యం సేవించడం కొందరికి పరిపాటయింది. మద్యం కి తోడు ఖమ్మంలోని యువత గంజాయి కి కూడా బానిస వు తున్నారని పలువురు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.
మందుబాబుల ఆగడాలన చూసినవారు, వారి ప్రవర్తన చూసి వీరు గంజాయి మత్తులో ఉన్నారని పలువురు అనుకుంటున్నారు. గంజాయి మత్తులో ఉన్నప్పుడే ఈ విధంగా ప్రవర్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వీరి చేష్టలతో విసిగి ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన మద్యం బాబులు వైరా రోడ్డు లోని ఎస్ ఆర్ గార్డెన్ వద్ద హల్చల్ చేశారు.
హైవేపై వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలగజేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. సమీపంలోని ఓ షాపు వారితో ఘర్షణకు దిగి, వారిపై దాడి చేశారు. షాప్ ముందు ఉన్న ఒక ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటిచ్చారని తెలిసింది. ఇటీవల వైరా రోడ్డు లోని ఒక కార్ షోరూమ్ వద్ద మద్యం బాబులు ఒక పాఠశాల విద్యార్థి తో గొ డవపడి కొట్టారు.
మద్యం దానికి తోడు గంజాయి తీసుకోవడంతో వీరు బైకులు నడిపేటప్పుడు విపరీతమైన స్పీడుతో వెళ్తుంటారని పలువురు అంటున్నారు. గత శని ఆదివారాల్లో పోలీసులు నిర్వహించిన వాహన తనికాల్లో పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికారు. పోలీస్ వారు తగు చర్యలు తీసుకుని మద్యం బాబుల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.