calender_icon.png 14 August, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యలరహిత సమాజ నిర్మాణం

14-08-2025 12:33:44 AM

నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్

నల్లగొండ క్రైమ్, ఆగస్టు 13 : మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. బుధవారం ఎన్జి కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ..విద్యార్ధి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడి జీవితం వృథా చేసుకోకూడదని, ఒక్కసారి డ్రగ్స్ వాడితే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛిన్నం కావడంతో పాటు, ఆర్థిక సమస్యలు,సమాజంలో గౌరవం లేకుండా పోతుందన్నారు.

సంతోషం కోసం సేవించడం అలవాటుగా మారి డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని చెప్పారు.  విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు.

యువత ఒక్కసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు, ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సిఐ రాఘవరావు, టూటౌన్ ఎస్‌ఐ సైదులు, కాలేజీ ప్రిన్సిపల్ ఉపేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.