14-08-2025 12:36:16 AM
కళ్లు ఉండి చూడలేని కబోది జగదీశ్‌రెడ్డి
ఎమ్మెల్సీ శంకర్ నాయక్
నల్లగొండ టౌన్, ఆగస్టు 13 : అసలైన సిసలైన దద్దమ్మలు బిఆర్‌ఎస్ పాలకులేనని, మీ పార్టీ కవిత చెప్పింది నువ్వు లిల్లీ అని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నేనావత్ శంకర్ నాయక్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పై మండిపడ్డారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటి రూపాయల సొంత నిధులతో కాలువలో చెట్లను తొలగించారని పేర్కొన్నారు. ఎస్‌ఎల్బీసీ,డిండి, నక్కల గండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే అన్ని కాంగ్రెస్ హయంలోనే పూర్తి చేస్తామని ప్రజలకందరికి తెలుసన్నారు. మా మంత్రులు సర్వతో ముఖ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
గత బిఆర్‌ఎస్ పాలకులు భూ దందాలు, ఇసుక దందా కంకర దందా చేశారని విమర్శించారు. మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డిలను విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదన్నారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో పెండింగ్లో పెట్టిన సాగు తాగు నీతి ప్రాజెక్టులన్నింటినీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు విడుదల చేసి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాడని అన్నారు.
బిఆర్‌ఎస్ హయంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి అయిందన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.