calender_icon.png 15 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధన్వాడ దత్తుడి సేవలో దుద్దిళ్ల కుటుంబం

16-12-2024 01:07:09 AM

మంత్రి దుద్దిళ్ల కుటుంబంపై దత్తుడి ఆశీర్వాదాలు 

మంథని, డిసెంబర్ 15 (విజయక్రాంతి): దత్తాత్రేయ స్వామి సేవలో దుద్దిళ్ల కుటుం బం తరిస్తున్నది. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు దత్తాత్రేయ స్వామికి వీరభక్తుడు. ఆయన ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా ఉన్నప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి నవరాత్రులకు మంథనిలో రెండు రోజులు ఉండి దత్తాత్రేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల తో కలిసి పూజలు చేసేవారు.

స్వామివారి ఆ శీర్వాదంతో ఏ పని మొదలుపెట్టినా అందు లో శ్రీపాదరావు విజయం సాధించేవారు. శ్రీపాదరావు మరణం తర్వాత ఆయన కుమారుడు, మంత్రి శ్రీధర్‌బాబు ఈ ఉత్సవాల్లో భాగమవతున్నారు. తన స్వగ్రామమై న ధన్వాడలోని వారి సొంత స్థలంలో 2014లో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు.

అక్కడికి వెళ్లిన ప్రతీసారి స్వామికి పూజలు చేస్తారు. వారం రోజులుగా దత్తాత్రేయ ఆలయంలో నవరాత్రులు జరుగుతున్నా యి. హైదరాబాదులో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మంత్రి ఆదివారం కుటుంబసభ్యుల తో ధన్వాడకు వచ్చి హోమం చేశారు.