calender_icon.png 20 December, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21న టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సదస్సు

20-12-2025 02:09:03 AM

హాజరుకానున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఈనెల 21న హైదరాబాద్ నాగొల్‌లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ఆధ్వర్యంలో విద్యాసదస్సును నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధానకార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యా విధానాల్లో అవసరమైన మార్పులు, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించేందుక తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.

ఈ విద్యాసదస్సుకు రాష్ట్ర మంత్రులు డీ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రస్తుత టీఆర్‌టీఎఫ్ ఉమ్మడి ఏపీలో ఏపీటీఎఫ్‌గా ఏర్పాటై ఎనిమిది దశాబ్ధాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సదస్సుకు పలువురు ఎమ్మెల్సీలు, ఉద్యోగుల జేఏసీ నేతలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, టీఆర్టీఎఫ్ నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు.