20-12-2025 02:12:14 AM
12 మంది ప్రధానోపాధ్యాయులకు అప్పగింత
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): పలు జిల్లాల్లో గ్రేడ్2 గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈవో బాధ్యతలను గెజిటెడ్ హెడ్‌మాస్టర్లకు అప్పగించారు. అయితే ఇటీవల కాలంలో పలువు రు హెచ్‌ఎంలు పదవీ విరమణ పొందడంతో వారి స్థానాల్లో ఎంఈవోలుగా వేరే వారికి అదనపు బాధ్యతలను అప్పగించారు.
మొత్తం ఏడు జిల్లాల్లో 12 మంది హెడ్‌మాస్టర్లకు ఎంఈవోలుగా బాధ్యతలను అప్పగించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎంఈవోగా ఎస్.రవీందర్, ఖానాపూర్ ఎంఈవోగా ఎం.చరణ్ సింగ్, సంగెం ఎంఈవోగా ఎస్.నరసింహా, పర్వతగిరి ఎంఈవోగా ఏ.బిక్షపతి, మెదక్ జిల్లా కుల్చారం ఎంఈవోగా కే.ఉమారాణి, సిద్ధిపేట్ జిల్లా కొమురవెళ్లి ఎంఈవోగా కోణేటి రవి, ఖమ్మం పెనుబల్లి ఎంఈవోగా కే.మోహన్ రావు, నల్లగొండ మిర్యాలగూడ ఎంఈవోగా ఆర్.మాంగ్యనాయక్, దామరచర్ల ఎంఈవోగా కే.సైదా నాయక్, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ఎంఈవోగా డీ.నిర్మల, కొత్తూర్ ఎంఈవోగా ఎస్.వెంకట్ రామ్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఆర్సీ పురం ఎంఈవోగా బీ.రాములుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.