calender_icon.png 12 May, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎస్‌ఎఫ్ కృషి అమోఘం

17-12-2024 02:25:30 AM

* హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుస్తాం

* మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఐఎస్‌ఎఫ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జెనరేటివ్ ఏఐ రాకతో ప్రపంచం అద్భుతంగా మారిపోతోందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి దీనివల్ల అపారమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

ఏఐ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ వంటి ప్రభుత్వ ముందడుగు చర్యలతో నైపుణ్యంతో కూడిన నిపుణుల అభివృద్ధి, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, స్మార్ట్ మొబిలిటీ, తయారీ వంటి రంగాల అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో దోహదపడుతుందని మంత్రి ప్రశంసించారు.