17-12-2024 02:22:52 AM
పీవైఎల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షడు ఇందూరు సాగర్, ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ డిమాండ్‌చేశారు. సోమవారం పీవైఎల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగా రు. పోలీసులు వారిని అరెస్ట్‌చేసి బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సాగర్, లక్ష్మీనారాయణ మాట్లాడు తూ.. గత పాలకులు ఇచ్చిన నోటిఫికేషన్‌తో ఉద్యోగ నియామకాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 30 వేల పోస్టులనే భర్తీ చేసిందని చెప్పారు.
వివిదశాఖల్లో ఇంకా రెండు లక్షలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఖాళీ పోస్టులపై అసెంబ్లీలో చర్చ జరిపి తీర్మానం చేసి భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. తెలంగాణలో మత్తుపదార్థాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నాయకులు సత్యం, రమేశ్, రవి, కుమార్, ధరావత్వ్రి తదితరులు పాల్గొన్నారు.