calender_icon.png 19 August, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీ భక్తులకు శత్రువులు నీ శత్రువులే

04-01-2025 12:00:00 AM

గోపికలకు నీళాదేవికి మధ్య వాగ్వా దం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నాడు. గోపికలు నిష్ఠూరాలు ఆడారు. నీళాదేవీ మాట్లాడడం లేదు. గొల్ల పడుచులు శ్రీకృష్ణుడిని, ఆ తర్వాత నీళాదేవిని మరోసారి అర్థిస్తున్నారు. నేను నాది అనే ఆలోచనలను వదులుకుంటే జ్ఞానం కలుగుతుంది, అదే భక్తికి వైరాగ్యానికి దారితీస్తుంది. అప్పుడే బ్రహ్మానందానుభవ స్నానం లభిస్తుందని చాటిచెప్పే పాశురం ఇది.

ముప్పత్తు మూవర్ అమరర్కు= ముప్పు మూడు వర్గాల దేవతలను, మున్ శెన్ఱు= ఆప ద రావడానికి ముందే వెళ్ళి కాపాడే, కప్పం తవిర్కుం కలియే!= గొప్ప బలం కలవాడివే, తుయిల్ ఏరాయ్= లేవవయ్యా. శెప్పం ఉడైయాయ్!= సత్య పరాక్రమశాలీ, ఆడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఏమైంది నీ మాట, తిఱలుడైయాయ్= సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, శేత్తార్కు వెప్పమ్కొడుక్కుం విమలా!= శత్రువులకు దుఖాఃన్నిచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటని వాడా, తుయిల్ ఎరాయ్= నిద్ర లేవయ్యా.

నిన్న అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా, శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్= సమమైన అంగ సౌష్టవ సౌందర్యం కల్గి, నప్పినై= స్వామి సంబంధంతో, నంగాయ్= పరిపూర్ణమైన అందం కలదానా!, తిరువే!= సాక్షాత్తు నీవే లక్ష్మివి, తుయిలెరాయ్= మేల్కోవమ్మా.

అమ్మ ఏం కావాలని అడిగింది, ఉక్కముమ్= స్నానానికి తర్వాత పట్టిన స్వేదాన్ని వదిలించే విసనకర్ర కావాలి, తట్టొళియుమ్= స్నానం తర్వాత అలకరించుకోవడానికి ఒక నిలువుటద్దం కావాలి, తందు= ఈ రెండు ఇచ్చి, ఉన్మణాళనై= నీ స్వామిని, ఇప్పోదే= ఇప్పుడే, ఎమ్ము= మాతో కలిపి, నీరాట్టు= నీరాడించు.

మనకు 33 కోట్లమంది దేవతలు. వారికి ఆపదలు వస్తాయని చూచాయగా తెలిసినా ముందు తానే వెళ్లి నారాయణుడు వారి కష్టాలను తొలగిస్తాడట. మిత్రులను ఆదుకుం టూ, శత్రువులను భయభీతులను చేసే మహాబలుడు, పరాక్రమ విక్రముడు. మరి, ఇదేమి టి ఈ రోజు పానుపు పై నుంచి లేవడమే లేదు? గోపికలు అప్పుడు మళ్లీ నీళాదేవిని ప్రార్థిస్తారు. ఎరుపైన పెదాలు, ఎత్తయిన వక్షస్థలం, సన్నని నడుముతో నీళాదేవి, విష్ణుప త్ని శ్రీదేవివలె అతిలోక సుందరి. మీరిరువురూ లేవండి! మా సిరినోముకు కావలసిన అద్దమూ, ఆలవట్టమూ, మీ శ్రీనాథుడిని ఇ వ్వండి. శ్రీకృష్ణుడితో కలిసి స్నానాలు చేసే మ హాభాగ్యం మాకు కల్పించడమ్మా అని నప్పి న్న పిరాట్టి నీళాదేవిని వేడుకుంటున్నారు.

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు కప్పమ్ తవిర్ క్కుమ్ కలియే తుయిలెజాయ్ 33 కోట్లమంది దేవతలకు ఆపద కలగకముందే వెళ్లిరక్షించిన వాడా. దేవతలు 33 కో ట్లమంది, గొల్లపిల్లలమైన మా సంఖ్య త క్కువ. 33 కోట్లకు తక్కువగా ఉంటే నీవు కా పాడవా? వారికి బలం ఎక్కువ, పురుషులని అహంకారం.- మేం పురుషులం కాదు, అబల లం. బలం లేని వారిని కాపాడాలి కదా.

గొల్ల పడుచులం, నీ చరణాలే నమ్ముకున్నాం. వారి కి పదవులు కావాలి, రాజ్యాలు కాపాడుకోవాలి- మాకు ఆ అవసరమే లేదు. అటువంటి వేరే ప్రయోజనాలేవీ లేవు. ఇంకేదైనా ఆశించే వారినే ఆదుకుంటారా?  నీకంటూ వేరు శత్రువులు లేరు. కాని, నీ భక్తులకు శత్రువులు నీ శత్రువులే అని భావించి వారినుంచి రక్షిస్తావు.