3 July, 2026 | 5:02 AM

రైతు నేస్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి

12-06-2024 01:38 AM

వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య

వరంగల్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ నర్సంపేట పట్టణంలోని పలు విత్తన దుకాణాలు, ఆగ్రో కేంద్రాలను తనిఖీ చేశారు. పర్యటనలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాల్, ఆర్డీవో కృష్ణవేణి ఉన్నారు.

వైద్య కళాశాల పనులను పూర్తి చేయాలి

నర్సంపేటలో నిర్మాణ దశలో ఉన్న వైద్య కళాశాలను మంగళవారం కలెక్టర్ కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. జూలై 15 లోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కిషన్, వైద్యాధికారులు ఉన్నారు.