calender_icon.png 31 July, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసురేసింది.. రైతన్న మురిసిండు

28-07-2025 12:43:26 AM

-  జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అల్పపీడనం 

- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 

- పొలం పనుల్లో రైతన్నలు బిజీబిజీ 

- ఎరువులకు మస్తు డిమాండ్

- క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న వ్యవసాయ అధికారులు 

రంగారెడ్డి,జిల్లా 27( విజయ క్రాంతి): గత వారం రోజుల క్రితం వరుణ దేవుడా కనుకరించవా అంటూ రైతన్నలు మొగలువైపు దీ నంగా చూసిన దృశ్యాలే మన కళ్ళ ముందు కదలాడాయి. అసలు ఇంతకు వానలు కురుస్తాయా? కురువవా? అంటూ రైతన్న లో సంశయం. జూన్ నెలలో జిల్లావ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి.

రైతులంతా పొలం బాట పట్టి తమ చేను.... చెలకలను దున్ని విత్తనాలు వేశారు. సకాలం లో వానలు కురవకపోవడంతో చెలకల లో వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని మం డలాల్లో విత్తనాలు మొలకెత్తిన ఎండల దా టికి పొలంలో నే మాడిపోయాయి. ఇది చూ సి జిల్లా వ్యాప్తంగా రైతన్నల్లో ఆందోళన మొ దలైంది. అప్పులు చేసి ఎవుసం చేస్తే కాలం ఇలా చేసింది అంటూ రైతన్నలు దిగాలు పడ్డారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతన్నల్లో మళ్లీ ఆశలు చిగురించేలా చే సాయి. అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యా ప్తంగా వారం రోజులుగా వానలు దంచి కొ ట్టాయి. దీంతో వాగులు,వంకలు పొంగిపొర్లాయి. కుంటలు చెరువులోకి వరద నీరు వ చ్చి చేరింది. పొలాల్లో నాటిన విత్తనాలు మొ లకెత్తడంతోపాటు, మొలకెత్తిన విత్తనాలకు కొంత జీవం పోసినట్టు అయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 26 మిల్లీమీటర్ల వ ర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికారులు చెప్పారు.

ఆమనగల్ బ్లాక్, షాద్ నగర్ ఇబ్రహీంపట్నం, చేవెళ్ల,మహేశ్వరం, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఆయా మం డలాల్లో మామూలు నుంచి భారీ వర్షాలు కురిసాయి. వర్షాల కారణంగా ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చే స్తూ అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు.

 ఎరువులకు మస్తు డిమాండ్

 రైతన్నలు మళ్లీ పొలం బాట పట్టడంతో ఎరువులకు మస్తు డిమాండ్ పెరిగింది. పొ లాలో తుకాలు పోసిన రైతులు వరి నాట్లు ప్రారంభించడం తో పాటు పత్తి,జొన్న,మొక్కజొన్న సాగు చేసిన చెలకల్లో కలుపుతీస్తూ రైతన్నలు బిజీబిజీగా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అదును అయినప్పుడే పొలాల్లో ఎరువులు వేస్తే ఖాతా,పూత మంచిగా పు య్యడంతోపాటు పంటలు మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. మరికొంతమంది రైతులు సాగు చేసిన పొలాల్లో విత్త నాలు కొనుగోలుకు సిద్ధమయ్యారు.

దీంతో విత్తనాలు,ఎరువులకు మస్తు డిమాండ్ పెరిగింది. ఎరువుల డిమాండ్ ను బట్టి డీలర్లు సైతం కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపణ సైతం ఉన్నాయి. జిల్లాలో పంటల సా గు అంచనాను బట్టి 50 వేల మెట్రిక్ టన్ను లు ఎరువులు అవసరం అవుతాయని అధికారులు ఇండెంట్ పెట్టారు. అయితే జూన్ నాటికి కేవలం 14 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేశంపేట్ మండలంలో ఎరువుల కొరత ఏర్పడటం తో రెండు రోజులు గా ఎరువుల కోసం రైతన్నలు దుకాణాల వద్ద పడిగాపులు పడ్డారు.

వ్యవసాయ అధికారులు ఎరువు ల కొరత లేదని.... సరిపడా ఎరువులు ఉన్నాయని అధికారులు చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. వ్యవసాయ అధికారులు ఎరువుల కొరత ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యమాయ ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ డీలర్లు ఎరువులను కృతిమ కొరత సృష్టించకుండా డీలర్ల కు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఎరువులను క్రయవిక్రయాలు జరపాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా పంటల సాగు అంచనా వివరాలు ఇలా ఉన్నాయి

పంట        ఎకరం 

1) వరి       1,40,238

2)పత్తి        1,29,098

3)మొక్కజొన్న   62,207

4) కంది పప్పు    9 వేల

5) జొన్న        2,762

6)వేరుశెనగ      96

7) ఇతర పంటలు  4,590 

ఎరువుల కొరత లేదు

 కేశంపేట మండలంలో సొసైటీ నిర్వాహకుడు అలసత్వం కారణంగా కొంత ఎరువుల సరఫరాలో ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 3,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అన్ని మండలాలకు పంపించాం. మరో 2,500 మెట్రిక్ టన్నుల ఎరువుల కోసం పై అధికారులకు ఇండెంట్ పెట్టాం. ఆయా మండలాల్లో ఎరువులు, విత్తనాలు అమ్మకాల్లో కృతిమ కొరిత సృష్టిస్తే డీలర్ల పైన చర్యలు ఉంటాయి. అధిక ధరలకు ఎరువులు,విత్తనాలు డీలర్లు అమ్మితే రైతులు తమకు ఫిర్యాదు చేయొచ్చు.

 ఉషా, జిల్లా వ్యవసాయ అధికారి, రంగారెడ్డి.