19-05-2025 01:04:48 AM
విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్‌చంద్ర, రాశీసింగ్, కాజల్ చౌదరి హీరోహీరోయిన్లుగా మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న తొలిచిత్రం ‘కరాలి’. రాకేశ్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నిర్మాత సాహు గారపాటి, నటుడు రాజారవీంద్ర, గోరంట్ల రవికుమార్, తుమాటి నరసింహరెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. “కరాళి’ టైటిల్‌లాగే సినిమా కూడా కొత్తగా ఉంటుంది. ఇంతవరకు చేయని డిఫరెంట్ యాక్షన్ డ్రామా” అన్నారు. నిర్మాత శివకృష్ణ మాట్లాడుతూ.. ‘నేను కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని. వీఆర్‌ఎస్ తీసుకుని సినిమాలపై ప్యాషన్‌తో ప్రొడ క్షన్ ప్రారంభించా.
రాకేశ్ చెప్పిన కథ చాలా నచ్చింది. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం’ అన్నారు. గరుడ రాముడు, రాజా రవీంద్ర, వెంకటేశ్ ముమ్మిడి వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: అపూర్వ అనిల్ శాలిగ్రామ్; సంగీతం: వికాస్ బడిసా; ఆర్ట్: సుప్రియ బట్టెపాటి.